యూపీలోని లఖింపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివాని అనే బాలిక అనారోగ్యానికి గురైంది. అయితే ఇటీవల సంభవించిన వరదల కారణంగా సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో మృతి చెందింది. అయితే నిస్సహాయుడైన సోదరుడు చెల్లిని కాపాడుకునేందుకు తన భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ మార్గమధ్యలోనే సోదరి మృతి చెందింది. ఆ యువకుడు చెల్లెలి మృతదేహన్ని ఎత్తుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.