గుండె తరుక్కు పోయే విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆస్పత్రిలో చేర్పించారు.. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.