యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. జిల్లాలోని కాంత్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి టాయిలెట్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడంతో ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగింది. ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.