Heat stroke: వేసవి కాలం పూర్తిగా మొదలవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే రోజుల గురించి ఆలోచిస్తేనే.. చెమటలు పట్టేస్తున్నాయి. వేసవికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య.. వడదెబ్బ. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా బయట పనికి వెళ్లే వాళ్లే కాదు.. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ ఎండదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలి.
- షుగర్ డ్రింక్స్, కాఫీలకు దూరంగా ఉండండి
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య అవసరమైతేనే బయటకు వెళ్లడం మంచింది.
- పనులకి వెళ్లాసొస్తే ఎండ రాక ముందే గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి
- తేలికగా, వదులుగా ఉంచే దుస్తులు మంచి ఎంపిక
- కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి.