తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. తెలంగాణలో గురువారం ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 424 మండలాల్లో వడగాలులు వీస్తుండగా, వీటిలో 47 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదవుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.