ఇండియాలో న్యూఇయర్ వేడుకులు అంబరాన్ని తాకాయి. యూత్ ఉత్సాహంగా న్యూఇయర్ కు వెల్ కమ్ పలికారు. అయితే ఈ న్యూఇయర్ వేడుకల్లో మద్యంతో పాటు కండోమ్స్ భారీగా ఆర్డర్ చేశారట. గంటకు 1700కు పైగా కండోమ్స్ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ ఫన్నీగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2023 ఏడాదిలో 9,940 కండోమ్‌లు ఆర్డర్ చేసినట్లు బ్లింకిట్ డెలివరీ సంస్థ ఫన్నీగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేశారు.
ఇన్ని కండోమ్స్ ఆర్డర్ చేశాడంటే ఇది కచ్చితంగా సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. 2023లో బ్లింకిట్‌ను దేశ ప్రజలు ఆదరించారని.. ఆర్డర్లలో గణనీయమైన పెరుగుదల కనపరిచిందని సంస్థ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండా వెల్లడించారు.