ద్రోణి ప్రభావంతో తెలంగాణాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.