ఇదే నిజం, వాంకిడి : ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో వర్షం దంచికొట్టింది. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి రహదారులన్ని జలమయమయ్యాయి. పలు దుకాణాల్లోకి నీళ్లు చేరడంతో వ్యాపారులు నష్టపోయారు. పలుచోట్ల రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు ఎండ మంటల నుంచి తీవ్ర ఉపశమనం లభించిందంటూ కొందరు అంటున్నారు.