ఇదేనిజం, అచ్చంపేట: గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప్పునుంతల మండలం మొల్గర , వంగూరు మండలం ఉల్పర గ్రామాల మధ్య ఉన్న దుందిబి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. తద్వారా ఉప్పునుంతల, వంగూరు మండలాలకు పూర్తిగా రాకపోకలు రద్దు అయ్యాయి. ఉల్పర వద్ద దుందుబి నదిలో ఏర్పాటు చేసిన భారీ కేడ్ ను సైతం వరద ముంచి వేయడంతో అటువైపు ఎవ్వరు కూడా వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.