తెలంగాణ వ్యాప్తంగా గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతోనూ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు.