Homeజిల్లా వార్తలుభారీ వర్షాలు, వరదలకు.. మిర్చి రైతు కన్నీరు..!

భారీ వర్షాలు, వరదలకు.. మిర్చి రైతు కన్నీరు..!

ఇదేనిజం, కుక్కునూరు: మండలంలో భారీ వర్షాలకు, గోదావరి వరదలకు, రైతు కుదేలయ్యాడు. కాగా అపారన నష్టం సంభవించింది. కుక్కునూరు మండలం సీతారామ నగరం పరిధిలో వరి పంట150″ ఎకరాలు, పత్తి 50″ ఎకరాలు, మినుము10″ ఎకరాలు నీట మునిగాయి. మండలంలో కివ్వక పంచాయతీ పరిధిలో మిర్చి పంట పొలాలు గోదావరి వరద ముంపునకు గురైనట్లు సమాచారం. ఇప్పటికే రైతన్న మిర్చికి ఎకరానికి రూ లక్ష రూపాయలు లోపు ఖర్చు పెట్టాడు. కాగా పెట్టిన పెట్టుబడి అంతా గోదావరి వరద పాలవటంతో మిర్చి రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. కాగా భూములు కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. మండలంలో ఎకరం భూమి కౌలు రూ 10 వేల నుంచి రూ 50 వేల వరకు పలకుతుంది. సారవంతమైన మిర్చి సాగుకు అనుకూలమైన భూములు రూ30 వేలుపై మాటే. ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు గోదావరి వరదలకు ఏజెన్సీ రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఏజెన్సీకి గోదావరి గండం పొంచి ఉంది.కాగా ఈ వరదలకు మిర్చి రైతుల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img