Homeహైదరాబాద్latest Newsభారీ వర్షాలు.. విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేసిన సీఎండీ

భారీ వర్షాలు.. విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేసిన సీఎండీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసారు. విద్యుత్ అంతరాయం కలిగితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు.

Recent

- Advertisment -spot_img