తెలంగాణను భారీ వర్షాలు అతాలకుతలం చేశాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో ఓ ఇళ్లు అందరూ చూస్తుండగానే కుప్పుకూలింది. వడ్ల సత్తయ్యకు చెందిన ఇళ్లు భారీ వర్షాలకు తడిచి ముద్దయి.. ప్రమాదకరంగా ఉంది. దీంతో ముందుగానే గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.