భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో సీఎం రేవంత్ ను కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. సీఎం రేవంత్ ఉద్యోగులందరినీ అభినందించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతానన్నారు.