తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరో కీలక హెచ్చరిక చేసింది ఐఎండీ. తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు వానలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది.