రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.