భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్రలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో రెండు రోజులుగా వర్షం కురవలేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.