తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.