HomeతెలంగాణHeavy rains: ఈ ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షం.. తస్మాత్ జాగ్రత్త..!

Heavy rains: ఈ ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షం.. తస్మాత్ జాగ్రత్త..!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 7 గంటల్లోపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్, భువనగిరిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img