హైదరాబాద్ లో మరో 3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం 40- 50kmph, గురువారం 30-40kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.