గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్వమిత్రి నదికి వరద పోటెత్తింది. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ కుటుంబం చిక్కుకుపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తమను రక్షించినట్లు సోషల్ మీడియా వేదికగా రాధా యాదవ్ ఓ పోస్టు పెట్టింది. ‘‘రోడ్లన్నీ నీటితో ముగినిపోయాయి. మేమంతా అందులో చిక్కుకుపోయాం. మమ్మల్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ధన్యవాదాలు’’అని రాధా వెల్లడించింది.