Heavy rains in Hyderabad: హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో మరికాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. అయితే, గత నాలుగు రోజులుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే.