హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. శనివారం సైతం వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.