దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం దంచికొట్టింది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. ఇక భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది.