ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో నదుల వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి బోటుపై వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.