భారీవర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కుపైగా బస్సులను రద్దు చేసింది. ముఖ్యంగా ఖమ్మం-విజయవాడ-మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు వివరించారు.