తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ‘కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికారులు సెలవులు పెట్టొద్దు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంఓకు అందించాలి’ అని ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో టెలికాన్ఫనెన్స్ లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు.