తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి , వికారాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో వానలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.