Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో భారీ వర్షాలు.. వర్షపాతం వివరాలు ఇవే..!

తెలంగాణలో భారీ వర్షాలు.. వర్షపాతం వివరాలు ఇవే..!

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో నిన్న అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉ.8.30 నుంచి ఈరోజు ఉ.6 వరకు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలో 25.43 సెం.మీ, నిజామాబాద్ తూంపల్లిలో 22.1 సెం.మీ, కామారెడ్డి గాంధారిలో 18.6 సెం.మీ, తాడ్వాయి, లింగంపేటలో 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img