తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూపాలపల్లి, జగిత్యాల, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.