Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో కాసేపట్లో భారీ వర్షం..!

తెలంగాణలో కాసేపట్లో భారీ వర్షం..!

తెలంగాణలో కాసేపట్లో భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా రెండు గంటల తర్వాత వర్షం పడే సూచనలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img