తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.