తెలంగాణలోని పలు జిల్లాల్లో, హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. 1-2 గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురిసింది. కాగా, ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.