దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. దసరాకు ముందరోజు శుక్రవారమే రూ.205 కోట్ల స్టాక్ ఎక్సైజ్ డిపోల నుంచి వైన్ షాపులకు, బార్లకు, క్లబ్లకు, పబ్లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈనెల 1 నుంచి శుక్రవారం వరకు 11 రోజుల్లో రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది.