బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో తెలంగాణలో రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.