వినాయకుడి ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నిమజ్జనానికి వచ్చే గణనాథులతో ట్యాంక్ బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.