Helicopter crash : న్యూయార్క్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జర్మన్ కంపెనీ సీమెన్స్ సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్, ఆయన కుటుంబం మృతి చెందింది. న్యూయార్క్ సందర్శించడానికి వచ్చిన కుటుంబం పర్యాటక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా అది కూలిపోయింది. హెలికాప్టర్ మాన్‌హట్టన్ సమీపంలోని హడ్సన్ నదిపై ఎగురుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, హెలికాప్టర్ తిరగబడి నదిలోకి కూలిపోయింది. మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య మెర్కా కాంపురుబి మోంటల్, వారి ముగ్గురు పిల్లలు మరియు పైలట్ ప్రాణాలు కోల్పోయారు.