ఇదే నిజం, సైదాపూర్ మండలం : కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్‌లో ఇటీవల మృతి చెందిన బాలగోని తిరుపతి కుటుంబానికి సైదాపూర్ పురుషుల పొదుపు సంఘం బాసటగా నిలిచింది. మండల పొదుపు సమితి అధ్యక్షులు పైడిపల్లి రవీందర్ గౌడ్ రూ. 70000 తిరుపతి భార్య శ్రీదేవికి అందించారు. సమితి ఉపాధ్యక్షులు బత్తుల భూమయ్య , సంఘ పర్యవేక్షకులు వేముల కిషోర్, సంఘ ఉపాధ్యక్షులు దొనికన మారుతి తదితరులు పాల్గొన్నారు.