అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లిపై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. జైనబ్ రద్దీ చాలా మంచి అమ్మాయి అని, ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం కలిగి ఉంటుందన్నారు. ఇద్దరూ కలిసి తమ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు అని నాగార్జున అన్నారు. ఆమెను సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనున్నట్లు తెలిపారు.