‘KGF-2’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన హీరో యష్, ఇప్పుడు ”టాక్సిక్” సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారడానికి గట్టి అడుగు వేస్తున్నాడు. ఈ సినిమాని హాలీవుడ్ లెవల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మరియు దీని కోసం ప్రతిష్టాత్మక మైన 20వ సెంచరీ ఫాక్స్ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతున్నాడు.
ఇప్పుడు 1915 నుంచి సినిమాలను నిర్మిస్తున్న ప్రముఖ హాలీవుడ్ స్టూడియో 20వ సెంచరీ ఫాక్స్‌తో యష్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తమ సినిమాను భారీగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ కారణంగా వారు నిర్మాణ సంస్థ అయిన 20th సెంచరీ స్టూడియోస్‌తో మాట్లాడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ మరియు విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నందున, ‘టాక్సిక్’ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి 20th సెంచరీ స్టూడియోస్‌ను సంప్రదించినట్లు టాక్సిక్ టీమ్‌లోని ఒక వ్యక్తి పింక్‌విల్లాకు నివేదించినట్లు తెలిసింది.