తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చెరువుల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతలో భాగంగా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత పెద్ద సంచలనంగా మారింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కన్ను సినీ హీరో బాలకృష్ణ, జానా రెడ్డి ఇళ్లపై పడిన సంగతి తెలిసిందే.ఫిల్మ్ నగర్ లో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్స్ చేసారని, ఆయన ఇంటి వద్దకు బుల్డోజర్లు కూడా వచ్చాయని మీడియా లో ఒక వార్త సంచలనం రేపింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్లాన్‌ల అమలులో భాగంగా జానా రెడ్డి, బాలకృష్ణ ఇంటిలోని కొంత భాగం భూసేకరణ చేయాలనీ నిర్ణయించుకొని, వాళ్ళిద్దరినీ ఏమాత్రం సంప్రదించకుండా వాళ్ళ ఇళ్ల గోడలపై మార్కింగ్స్ చేసింది. దీనిపై అటు బాలకృష్ణ, ఇటు జానారెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా చూసిన అభిమానులు తెలంగాణలో అసలేం జరుగుతుంది..?, సినీ తారలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కోపం అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.