Dharshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ సహా ఏడుగురు నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీరో దర్శన్ (Dharshan) బెయిల్‌ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 ప్రధాన కారణాలను వెల్లడించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అప్పీల్‌లో ప్రస్తావించారు. పవిత్ర గౌడ, హీరో దర్శన్ (Dharshan), జగదీష్, అను కుమార్, నాగరాజ్, లక్ష్మణ్, ప్రదోష్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. హీరో దర్శన్‌కి (Dharshan) రాష్ట్రం లోపల మరియు వెలుపల భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీ కావడం వల్ల సాక్షిని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. 262 మంది సాక్షులను ఛార్జ్‌షీట్‌లో పేర్కొనగా, దానిని హైకోర్టు పరిగణించలేదు. విచారణలో జాప్యం కారణంగానే బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు పేర్కొంది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండానే బెయిల్ మంజూరు చేసింది. సీటు కోర్టులో కేసు విచారణ దశకు చేరుకోలేదు. ఇలా మొత్తం 7 కారణాలను తెలుపుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.