అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా వింగ్ దూకుడు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు పలువురు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే హైడ్రా ఇప్పటి వరకు ప్రముఖుల అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు దాఖలాలు లేవు. హైడ్రా ప్రతాపం సామాన్యల మీద మాత్రమేనా? లేదా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తుందా.. వేచి చూడాలి.