దగ్గుపాటి రానా అట్టు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వేరే హీరో సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం రానా ‘ది రానా దగ్గుబాటి షో’ కి హోస్టుగా చేస్తున్నాడు. తాజాగా ఈ షోకి నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు. ఈ షోలో రానా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురుంచి నాని ని ఒక ప్రశ్న అడిగాడు.దానికి నాని సమాధానం ఇస్తూ.. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసునని నాని అన్నారు. రాజకీయాల్లోనూ అంతే స్థాయికి ఎదిగారని కొనియాడారు. రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని నాని అన్నారు. సినీ పరిశ్రమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎంతో మందికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని అన్నారు.