పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలికి గాయమైంది. ఒక సినిమా షూటింగ్‌లో ఆయనకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ‘కల్కి 2898 AD’ మూవీ ప్రస్తుతం జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా జపాన్‌లో 2025 జనవరి 3న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జపాన్ అభిమానుల కోసం ప్రభాస్ ఓ పోస్ట్ విడుదల చేశారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. జపాన్‌లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి స్వల్పగాయమవడంతో రాలేకపోతున్నా అని ప్రభాస్ పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తున్నరు.