హీరో సిద్ధార్థ్ ఓ ఇంటి వాడయ్యాడు. తాజాగా నటి అదితిరావుతో సిద్ధార్థ్ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో తెలంగాణలోని వనపర్తిలోని ఓ దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.