Homeసినిమాహీరో సూర్యకు స్వల్ప గాయం.. షూటింగ్​కు బ్రేక్

హీరో సూర్యకు స్వల్ప గాయం.. షూటింగ్​కు బ్రేక్

కోలీవుడ్ స్టార్ సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ డ్రామా ‘కంగువా’. ప్రస్తుతం ఈ సినిమా షూట్ చెన్నైలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్‌లో సూర్యకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన షూట్‌లో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయన భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే మూవీ టీమ్ షూటింగ్‌ను నిలిపివేసిందని టాక్. దీనిపై సూర్య అభిమానులు స్పందిస్తూ ‘గెట్ వెల్‌ సూన్‌’అంటూ పోస్టులు పెడుతున్నారు. కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దిశా పటానీ హీరోయిన్. బాబీ డియోల్ విలన్​గా కనిపించనున్నారు. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 38 భాషల్లో విడుదల చేయనున్నామని ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తెలిపారు. 3డీ, ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.

Recent

- Advertisment -spot_img