‘కిస్’ అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. తాజాగా శ్రీలీల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోందనే వార్త టాలీవుడ్ యార్డ్‌లో హల్‌చల్ చేసింది. ప్రఖ్యాత చిత్రనిర్మాత కరణ్ జోహార్ తన రాబోయే సినిమా ‘తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ కోసం శ్రీలని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీర కార్తీక్ ఆర్యన్ తో నటించబోతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్‌ల పేర్లు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.