Homeహైదరాబాద్latest NewsHeroines : వాళ్ళ వల్లే ఆ హీరోయిన్స్ కెరీర్ నాశనం అయిందా..?

Heroines : వాళ్ళ వల్లే ఆ హీరోయిన్స్ కెరీర్ నాశనం అయిందా..?

Heroines : హీరోయిన్స్ అవ్వాలని చాలా మంది ఎంతో ఆశతో సినిమా ఇండస్ట్రీకి వస్తారు. చాలా మంది హీరోయిన్లు మోడలింగ్, యాడ్స్, లేదా చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కొంత మంది హీరోయిన్స్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఇస్తారు. కానీ వెంటనే తరువాత సినిమాలతో ఫ్లాప్ ఇస్తారు. ఈ క్రమంలో వారికి ఐరన్ లెగ్ అని సినీ ఇండస్ట్రీ పేరు పెడుతుంది. తరువాత ఆ హీరోయిన్స్ కి సినిమా ఛాన్సులు రావడం కష్టమే అని చెప్పాలి. అయితే యంగ్ హీరోలతో మొదటి సినిమా చేస్తే హీరోయిన్ కెరీర్ నాశనం అవుతుందా అనే ప్రశ్న నెలకొంది.మొదటి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన ఆ తరువాత వారు చేసిన సినిమాలు ప్లాప్స్ కావడంతో సినిమా అవకాశాలు లేక కొంతమంది హీరోయిన్స్ కలిగే ఉన్నారు.

మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ”ఉప్పెన” సినిమాతో కృతి శెట్టి సంచలనం సృష్టించింది. ఆ తరువాత చేసిన సినిమలు అన్ని పరాజయాలతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ”అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి షాలిని పాండే ఎంట్రీ ఇచ్చింది. అయితే అందరూ ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్స్ కావడంతో ప్రస్తుతం సినిమాలు లేక కలిగే ఉంటుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ”లైలా” సినిమాతో పరిచయమైన కన్నడ బ్యూటీ ఆకాంక్ష శర్మ ఆ సినిమా ప్లాప్ తర్వాత అసలు ఎక్కడా కన్పించలేదు. నాని హీరోగా నటించిన ”మజ్ను” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్..ఆ తరువాత అల్లు అర్జున్ తో చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు అవకాశాలు లేక కాలిగా ఉంటుంది.

ఇలా చాలా మంది హీరోయిన్స్ యంగ్ హీరోలతో కంటెంట్ లేని సినిమాలు చేసి తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. ఇక ముందు అయినా మంచి కధలు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే తమ కెరీర్ మరి కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీలో సాగుతుంది.

Recent

- Advertisment -spot_img