HomeరాజకీయాలుHigh command angry on Revanth Reddy Revanth Reddy​ పై హైకమాండ్​ గుర్రు

High command angry on Revanth Reddy Revanth Reddy​ పై హైకమాండ్​ గుర్రు

– ప్రజల్లోకి బలంగా వెళ్లిన పేరు
– పీసీసీ చీఫ్​పై తీవ్ర ఆరోపణలు
– సొంతపార్టీ నుంచే అధిష్ఠానానికి ఫిర్యాదులు
– పారాచూట్​ లీడర్లకు టికెట్ల రావడంతో అసంతృప్తి
– టికెట్లు అమ్ముకున్నారని రేవంత్​పై ఆరోపణలు
– సీట్ల వ్యవహారంపై ఆరాతీసిన అగ్రనేత రాహుల్​
– హైకమాండ్​ కు తలనొప్పిగా మారిన టికెట్ల పంపిణీ
– బీఆర్ఎస్​కు ఆయుధంగా మారిన వ్యవహారం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి కాంగ్రెస్​ పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ లీడర్లే టికెట్ల వ్యవహారంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఐటీ మంత్రి కేటీఆర్..​ పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిని ఉద్దేశించి రేటెంత రెడ్డి అంటూ సంబోధించారు. ఈ పేరు జనంలోకి బలంగా వెళ్లిపోయింది. మరోవైపు కాంగ్రెస్​ శిబిరంలోనూ ఇదే తరహా ఆరోపణలు వస్తుండటం గమనార్హం. కాంగ్రెస్​ పార్టీకి చెందిన సీనియర్​ లీడర్లు .. ఢిల్లీకి వెళ్లి రేవంత్​ పై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. మహేశ్వరం టికెట్ ను అమ్ముకున్నారని రూ. 10 కోట్లు, ఐదెకరాల భూమి తీసుకున్నారని కాంగ్రెస్​ నేత కొత్త మనోహర్​ రెడ్డి ఆరోపించారు. అప్పటి నుంచీ ఈ ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక ఫస్ట్​ లిస్ట్​ ప్రకటించాక చాలా మంది అభ్యర్థులు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఉప్పల్​ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం ఫస్ట్​ లిస్ట్​ లో పేరు దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్​ పైనే ఆరోపణలు గుప్పించారు. ఇక రేవంత్​ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సోమశేఖర్ రెడ్డి సైతం రేవంత్​ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించడం గమనార్హం.

అధిష్ఠానానికి సీనియర్​ లీడర్ల క్యూ
ఇక సీనియర్​ కాంగ్రెస్​ సీనియర్​ లీడర్లు సైతం కాంగ్రెస్​ హైకమాండ్​ వద్దకు క్యూ కట్టినట్టు సమాచారం. వారంతా టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలనే ప్రధానంగా తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో ఓ దశలో కాంగ్రెస్ పరిశీలకులు, అధిష్ఠానం పెద్దలు ఆశ్చర్యపోయినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తుల కంటే .. రేవంత్​ పై వచ్చిన ఫిర్యాదుల సంఖ్యే ఎక్కువుందని వారు వ్యాఖ్యానించారట. ఇక టికెట్ల కేటాయింపులో తమకు న్యాయం చేయలేదని బీసీ లీడర్లు, ఉద్యమకారులు సైతం ఢిల్లీలో రేవంత్​ రెడ్డినే టార్గెట్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే ఓ దశలో కాంగ్రెస్​ హైకమాండ్ సైతం రేవంత్​ విషయంపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ స్థాయిలో రేవంత్ మీద ఎందుకు ఆరోపణలు రావడం పట్ల అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు టాక్​.

రేవంత్​కు చెక్​ పెట్టేందుకే రాజగోపాల్ రెడ్డికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారా?
కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేర్చుకున్నారు. రాజగోపాల్​ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు.. సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్​రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఇక రేవంత్​ సైతం అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారు. రేవంత్​ రాజగోపాల్​ రాకను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ హైకమాండ్​ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. రేవంత్​ కు చెక్​ పెట్టేందుకు రాజగోపాల్​ రెడ్డిని తిరిగి చేర్చుకున్నట్టు టాక్​.

ఈడీకి ఫిర్యాదులు
ఇటీవల రేవంత్​ రెడ్డి తీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మొదటి లిస్ట్​ రావడంతోనే ఈ స్థాయిలో విమర్శలు వస్తే .. రెండో లిస్ట్​ వస్తే ఇంకా ఎన్ని ఆరోపణలు వస్తాయని కాంగ్రెస్​ హైకమాండ్​ భావిస్తోంది. గద్వాల జిల్లాకు చెందిన కురువ విజయ్​ కుమార్​ పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నేరుగా ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు రేవంత్​ అనుచరులకు సైతం తలనొప్పిగా మారాయి. సొంత పార్టీలోనే రేవంత్​ రెడ్డిపై ఆరోపణలు వస్తుండటంతో హైకమాండ్​ కు కూడా ఈ వ్యవహారం చిక్కుముడిగా మారింది. పీసీసీ చీఫ్​ను ఇప్పటికిప్పుడు మారిస్తే పార్టీ నష్టపోతుందని భావిస్తూ అధ్యక్ష మార్పు వ్యవహారాన్ని పెండింగ్​ లో ఉంచినట్టు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో తెలంగాణలో తీవ్రంగా నష్టపోయింది. దీంతో కాంగ్రెస్​ ఈ అంశాన్ని పెండింగ్​ లో ఉంచినట్టు టాక్​.

30 స్థానాల్లో పారాచూట్​ లీడర్లకు టికెట్లు
కాంగ్రెస్​ పార్టీ మొత్తం 30 స్థానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ పారాచూట్ లీడర్లకే టికెట్లు ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీంతో వీరి దగ్గర రేవంత్​ రెడ్డి డబ్బు తీసుకొని.. వారికి అనుకూలంగా సర్వే రిపోర్టులు ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రీ సర్వేలు, ప్లాష్​ సర్వేలు చేయిస్తుండటంపై కూడా చాలా డౌట్స్​ వస్తున్నాయి. మరి రెండో లిస్ట్​ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకెంత చిచ్చు రేగుతుందో? ఇంకా ఎంతమంది లీడర్లు ఆరోపణలు చేస్తారో? వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img